ఒక వ్యక్తి తన జీవితంలో జరిగే మార్పుల నుండి సమర్థవంతగా కోలుకోగల లేదా సర్దుకోగల సామర్థ్యాన్ని resilience (స్థితిస్థాపకత) అంటారు.
మనందరం ఏదైనా సమస్య లేదా మార్పు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి వివిధ మార్గాలన్నీ ఉపయోగిస్తాము.ఎప్పుడు సమస్య వస్తుందో అప్పుడు దానికి తగిన మార్గం ఎంచుకుంటాం . తర్వాత ఆ మార్గాల గురించి మర్చిపోతాం .మన దృష్టి ,సమస్య పరిష్కారం మీద ఉంటుంది కానీ దానికి ఉపయోగపడిన మార్గంమీద ఉండదు. ఆమార్గాన్ని వేరే సమస్య వచ్చినప్పుడు ఉపయోగిస్తే పనిచేస్తుందో లేదో చెప్పలేము, ఎందుకంటే మనం మార్గం మీద దృష్టి పెట్టం .
ఇలా అనాలోచితంగా ఆపద్ధర్మంగా మార్గాలను ఉపయోగించడం వలన అది కొన్నిసార్లు విఫలం అయినప్పుడు అయోమయ స్థితిలో వెళ్ళిపోతాం. అందుకే మన మెదడు, సమస్యలను ఎదురుకునే లేదా సర్దుకుపోయే మార్గాలు ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకుంటే resilience ను పెంచుకోగలం.
Resilience పెంపొందించుకోవాలంటే , ముందు మన మెదడు ఏ ఏ ఆలోచనా వలలో చిక్కుకుంటుందో తెలుసు కోవాలి. సాధారణముగ ఈ క్రింది ఆలోచనావలలో మనం చిక్కుకుంటాం:
Mind reading( ఆలోచనలను చదవడం) : ఎదుటువారు ఏమి ఆలోచిస్తున్నారో వాళ్ళు చెప్పకుండానే మనకు తెలుసు అని ఊహించుకోవడం మరియు మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పకుండానే ఇతరులకు తెలుసు అనుకోవడాన్ని mindreading అంటారు.
ME (నేను) : అన్ని సమస్యలు నా వల్లనే అనుకోవడం.
THEM (వారు) : అన్ని సమస్యలకు కారణం ఇతరులు అనుకోవడం.
Catastrophizing (అతిగా ఆలోచించడం) :సమస్యను ఉన్నదానికంటే ఎక్కువ ఉహించుకొని విపత్తులను తెచ్చిపెట్టేదిగ ఆలోచించడం.
Helplessness(నిస్సహాయత) : ఒక రంగంలో జరిగిన ప్రతికూల సంఘటన జీవితం మొత్తాన్ని ప్రతికూలంగా మారుస్తుంది మరియు మనం ఏమి చేయలేము అనుకోవడం.
మన జీవితంలో ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ ఆలోచనావలలో చిక్కుకుంటున్నామో గుర్తించి , వాటిపై అవగాహన తెచ్చుకోవడం సాధన చేస్తూ ఉంటే, అప్పుడు అలాంటి ఆలోచనావలలోంచి బయటపడొచ్చు .
Resilience నిర్మించుకోవడానికి తదుపరి దేశ ఏమిటి అంటే , క్రింది కొలమానాలలో మనం
ఎక్కడ ఉన్నామో తరిచి చూసుకోవడం.
Self-belief (స్వీయ విశ్వాసం) : జీవితంలో ఎదురయ్యే సమస్యలు మరియు అడ్డంకులను పరిష్కరించే సామర్థ్యం గురించి తమపై తమకు విశ్వాసం ఉండడం.
Optimism (ఆశావాదం): ఎలాంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో చూడగలగడం.
purposeful direction ( ఉద్దేశపూర్వక దిశ ): జీవితంలో తమకు అంటూ లక్ష్యాలు పెట్టుకొని ఒక ప్రణాలికతో వాటిని సాదించాలి అన్న దిశగా సాగడం.
Adaptability (అనుకూలత): జీవితంలో వచ్చే పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ వెళ్లడం.
Ingenuity ( చాతుర్యం ): మనకు ఎదురయ్యే సమస్యలను మనం ఎంతవరకు పరిష్కరించుకోగలమో బేరీజు చేసుకోగలగడం.
Challenge Orientation (సవాల్ స్వీకరించిన దిశ ): పరిస్థితులను ఒక సవాలుగా తీసుకొని వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ సానుకూలత సాధించడం .
Emotion regulation (భావోద్వేగ నియంత్రణ ): ప్రతికూల మరియు సానుకూల పరిస్థితుల్లో భావోద్వేగాలకు లొంగకుండా జీవితంలో ముందుకు సాగడం .
Support Seeking ( సహాయం అర్థించగలగడం ): అవసరం అయినప్పుడు ఇతరాలు నుండి సహాయం అడిగి మొహమాటం లేకుండా అర్థించగలగడం .
ఆలోచనల వలల గురించి తెలుసుకొని మరియు resilience కు సంబంధించిన కొలమానాలు సమతుల్యం చేసుకుంటూ మన జీవితములో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదురుకుందాం.